నిరుద్యోగులే వారి టార్గెట్.. విదేశాల్లో మంచి ఉద్యోగం అని చెబుతారు.. లక్షల్లో జీతం, అన్ని రకాల సౌకర్యాలుంటాయని నమ్మబలుకుతారు..విదేశాలకు పంపిస్తారు.. విదేశాల్లో ఉద్యోగం అని ఎన్నో ఆశలతో వెళ్లిన నిరుద్యోగులకు చేయకూడని పనులన్నీ చేయిస్తారు. విదేశీ ఉద్యోగం పేరుతో సైబర్ క్రైమ్ కాల్ సెంటర్లకు నిరుద్యోగ యువతను పంపుతున్న మోసగాళ్ల ముఠా గుట్టు రట్టు అయింది.
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతను టార్గెట్ గా మోసాలకు పాల్పడుగున్న సైబర్ క్రైం ఏజెంట్ల గ్యాంగ్ ను పోలీసులు పట్టుకున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అక్కడ సైబర్ క్రైం చేయిస్తున్న ఏజెంట్ల గ్యాంగ్ ను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఉద్యోగాల పేరుతో యువతను మియన్మార్, థాయ్‌లాండ్‌కు తరలిస్తున్న హైదరాబాద్, విశాఖపట్నం, మైసూర్ కు చెందిన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
►ALSO READ | సైబరాబాద్ పోలీసు వెబ్‌సైట్..న్యూ లుక్, ఫాస్ట్ సర్వీస్
సైబర్ నేరాలకు సంబంధించి ఈ గ్యాంగ్ పై పలు కేసులు నమోదు చేశారు. విదేశీ ఉద్యోగాల పేరుతో పొంచివున్న ప్రమాదంపై యువత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
