cyber crime : ఫాస్ట్​ డెలివరీకి ఆశ పడి.. లక్షన్నర పోగొట్టుకుంది

cyber crime : ఫాస్ట్​ డెలివరీకి ఆశ పడి.. లక్షన్నర పోగొట్టుకుంది

సైబర్​ క్రైమ్​.. దీని గురించి  రాస్తే చరిత్ర అవుతుందేమో. నిత్యం ఎవరో ఒకరు ఏదో చోట బాధితులు డబ్బులు పోగొట్టుకోవడం.. పోలీసులను ఆశ్రయించడం ఇదే తంతు. విద్యావంతులు సైతం ఈ లిస్ట్​లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 

తాజాగా ఓ మహిళ.. కొరియర్ డెలివరీ సైబర్​ క్రైమ్​లో రూ.లక్ష 38 వేలు పోగొట్టుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ..  గుజరాత్​ రాష్ట్రం అహ్మదాబాద్​కి చెందిన 25 ఏళ్ల మితీక్షా షెత్​బట్టల పార్శిల్​ఆర్డర్​ చేశారు. అయితే  2–3 రోజులైనా పార్శల్​ రాకపోవడంతో టైలర్ కి ఫోన్​ చేసింది. టైలర్​పార్శల్​ని  అప్పుడే పంపానని చెప్పడంతో కంగు తింది. అదే సమయంలో కొరియర్​ సంస్థ ద్వారా తాను చేసిన లావాదేవీలు గుర్తొచ్చాయి. 

ఆమె ఆర్డర్​ ఇచ్చాక దాన్ని ట్రాక్​ చేయడానికి ఫోన్​కి వచ్చిన లింక్​పై క్లిక్​ చేసింది. మొదట రూ5 చెల్లించి త్వరగా ఆర్డర్ పొందాలనుకుంది. మళ్లీ రూ.5 చెల్లించనమనడంతో అలాగే చేసింది. తరువాత అనుమానం వచ్చి బ్యాంక్​ బ్యాలెన్స్ చెక్​ చేస్తే ఇంకేముందీ... అందులోని రూ.లక్ష 38 వేలు మాయమయ్యాయి. డబ్బుల్ని సైబర్​ నేరగాళ్లు దోచేశారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. 

మే నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  సైబర్ నేరగాళ్లు రోజుకో ఎత్తుగడతో వస్తున్నారని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గుర్తు తెలియన ఈ మెయిల్స్.. మెసెజెస్.. తదితర లింకులను క్లిక్​ చేయవద్దని సూచిస్తున్నారు.