లోన్ పేరుతో ఫోన్ చేసి 85 వేలు టోకరా..

లోన్ పేరుతో ఫోన్ చేసి 85 వేలు టోకరా..

ఆన్ లైన్ మోసాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. లోన్ల పేరుతో ఫోన్లు చేసి అందినకాడికి దోచుకుంటున్నారు.  కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి కి చెందిన మస్తాల సతీష్ అనే వ్యాపారి కి బజాజ్ ఫైనాన్స్ నుంచి మార్చి 15న ఫొన్ కాల్ వచ్చింది. మీకు  రెండు లక్షల రూపాయల  లోన్  మంజూరు అయిందని  నమ్మించిండు. తర్వాత   ఇన్సూరెన్స్, ప్రాసెసింగ్ , ముందుగా  మూడు నెలల ఇన్ స్టాల్ మెంట్ వంటి ఇతర చార్జీల పేరిట వ్యాపారి నుంచి  85 వేల 33 రూపాయలు పోన్ పే తో కట్టించుకున్నారు. తర్వాత లోన్ కోసం ఎన్ని సార్లు కాల్ చేసినా  ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయినట్లు గ్రహించిన వ్యాపారి పోలీసులకు కంప్లైంట్ చేసిండు. ఈ ఘటనపై దేవునిపల్లి పోలీసులు  కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్నారు.