
బషీర్బాగ్, వెలుగు: లోన్ ఇస్తామని నమ్మించిన సైబర్చీటర్స్ఓ వ్యక్తి వద్ద రూ.7.90 లక్షలు కాజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేటకు చెందిన వ్యక్తికి హైదరాబాద్ యూత్ కరేజ్(హెచ్ వైసీ) ఎన్జీవో వ్యవస్థాపకుడు సల్మాన్ ఖాన్ ఫొటో డీపీగా ఉన్న నంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది.
తమ సంస్థ తరఫున రూ.50 లక్షల లోన్ మంజూరైనట్లు తెలిపారు. ఈ లోన్ ను ప్రాసెస్ చేయడానికి ప్రాసెసింగ్, ఇతర చార్జెస్ పేరిట రూ.10 లక్షలు చెల్లించాలని చెప్పారు. నిజమని నమ్మిన అతను తనకు తెలిసిన వ్యక్తుల వద్ద అప్పు చేసి, మొత్తం రూ.7,90,000ను స్కామర్స్ అకౌంట్ కు బదిలీ చేశాడు.
తర్వాత మరో రూ.30 వేలు పంపించాలని డిమాండ్ చేశారు. ఇది స్కామ్ అని గ్రహించిన బాధితుడు మంగళవారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు.