ఐఏఎస్ నవీన్ మిట్టల్ పేరిట టోకరా

ఐఏఎస్ నవీన్ మిట్టల్ పేరిట టోకరా

జీడిమెట్ల, వెలుగు: ఐఏఎస్​ నవీన్​ మిట్టల్​ పేరిట ఓ మహిళను సైబర్​ నేరగాళ్లు మోసగించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. హైదరాబాద్ పేట్ ​బషీరాబాద్​కు చెందిన ఓ మహిళకు గత నెల 21న ఐఏఎస్​ నవీన్​ మిట్టల్​ పేరుతో నకిలీ ఫేస్​ బుక్​ ఐడీ నుంచి  మేసేజ్​ వచ్చింది. తన ఫ్రెండ్  సీఆర్​పీఎఫ్​కి చెందిన సుమిత్​కుమార్​కు హైదరాబాద్​ నుంచి జమ్మూకి ట్రాన్స్ ఫర్​ అయిందని, అతని ఇంటి సామగ్రి తక్కువ ధరకు అమ్ముతున్నాడని తెలిపారు.

ఆమె గతంలో నవీన్​ మిట్టల్​ వద్ద  పని చేయడంతో మేసేజ్​ నిజమేనని నమ్మింది. కొద్ది సేపటికే మరో వ్యక్తి ఫోన్​ చేసి ఫర్నిచర్​కు మొదట రూ.50 వేలు చెల్లించాలని మిగతా రూ.35 వేలు డెలివరీ అయ్యాక ఇవ్వాలని చెప్పాడు. వెంటనే బాధితురాలు రూ.50 వేలు చెల్లించింది. అనంతరం అతడు ఆమె నెంబర్​ బ్లాక్​ చేశాడు. మోసపోయానని తెలుసుకుని పేట్​బషీరాబాద్​ పోలీసులకు కంప్లయింట్ చేసింది.