
హైదరాబాద్ సిటీ, వెలుగు: అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ముఠాను సైబరాబాద్ ఎస్‌టీఎఫ్ డీటీ టీం పట్టుకుంది. సీఐ నాగరాజు వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌కు చెందిన రవీందర్ కత్రావత్ తరచూ ఢిల్లీ, ఇతర రాష్ట్రాలకు వెళ్లి పాత కార్లను కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తుంటాడు. సైడ్బిజినెస్గా ఢిల్లీలో తక్కువ ధరకు లభించే మద్యం బాటిళ్లను కారు డిక్కీలో ఉంచి, హైదరాబాద్‌కు తీసుకొస్తుంటాడు.
వాటిని కర్మాన్‌ఘాట్‌లో ఉండే తన స్నేహితుడు నాగిరెడ్డికి ఇస్తుంటాడు. ఇద్దరూ కలిసి ఆ బాటిళ్లను అమ్మి, లాభాలు పంచుకుంటారు. దీనిపై పక్కా సమాచారం రావడంతో ఎస్‌టీఎఫ్ డీటీ టీం సీఐ నాగరాజు తన సిబ్బందితో బుధవారం నాగిరెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన105 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని తెలిపారు.