
బషీర్బాగ్, వెలుగు: ప్రధాన మంత్రి కిసాన్ పేరిట ఓ వ్యక్తిని సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం.. యూసఫ్ గూడ ప్రాంతానికి చెందిన 30 ఏండ్ల వ్యక్తికి గత నెల 28న పీఎం కిసాన్ పేరుతో వాట్సాప్ కు ఏపీకే ఫైల్ ను పంపించారు. బాధిత వ్యక్తి ఆ లింక్ ను ఓపెన్ చేయగా, ఫోన్ హ్యాక్ అయ్యింది. అనంతరం బాధితుడి అకౌంట్ లో ఉన్న మొత్తం రూ. 1,95,000 లు డెబిట్ అయ్యాయి. స్కామర్స్ బాధితుడి వాట్సాప్ ను క్లోజ్ చేసి, అందులోని కాంటాక్ట్స్ కు డబ్బులు కావాలని మెసేజ్ లు పంపించారు. ఈ విషయం గ్రహించిన బాధితుడు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.