వరంగల్‍ కలెక్టర్ పేరుతో.. ఫేక్‍ ఫేస్‍బుక్‍ అకౌంట్‍

వరంగల్‍ కలెక్టర్ పేరుతో.. ఫేక్‍ ఫేస్‍బుక్‍ అకౌంట్‍
  • ప్రావీణ్య పేరుతో డబ్బులు వసూలు చేసేందుకు సైబర్‍ నేరగాళ్ల ప్లాన్​

వరంగల్‍, వెలుగు : వరంగల్‍ కలెక్టర్‍ ప్రావీణ్య పేరుతో సైబర్‍ నేరగాళ్లు ఫేక్‍ ఫేస్‍బుక్‍ అకౌంట్‍ క్రియేట్‍ చేశారు. ప్రొఫైల్‍ లో కలెక్టర్ ఫొటో పెట్టారు. ఆ అకౌంట్​నుంచి పలువురికి ఫ్రెండ్​ రిక్వెస్టులు పెట్టడంతోపాటు డబ్బులు కావాలంటూ మెసేజ్​లు పెట్టారు. డబ్బులు పంపాల్సిన నంబర్​(94776 414080) కూడా ఇచ్చారు. స్పందించిన వారితో మాటలు కలిపారు. తాను అర్జెంట్​మీటింగ్​లో ఉన్నానని,ఈ నంబర్​కు డబ్బులు పంపి స్క్రీన్​షాట్స్​ పెట్టాలని సూచించారు.

పలువురి ద్వారా విషయం తెలుసుకున్న కలెక్టర్​ ప్రావీణ్య.. తన ఒరిజినల్‍ ఫేస్‍బుక్‍ ఖాతా ద్వారా సైబర్‍ ఫ్రాడ్‍ విషయాన్ని షేర్‍ చేశారు. తన పేరుతో ఎవరు డబ్బులడిగినా ఇవ్వొద్దని సూచించారు. అలాంటి మెసేజెస్​ వచ్చిన  అకౌంట్​ను బ్లాక్‍ చేయాలని చెప్పారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.