అందినకాడికి దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లు

అందినకాడికి దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లు

హైదరాబాద్‌‌‌‌,వెలుగు: ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ పేరుతో సైబర్ క్రిమినల్స్ ​అందినంతా దోచేస్తున్నారు. అమీర్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌కి చెందిన మహిళకు 2017లో  వాట్సాప్ మెజేస్‌‌‌‌ వచ్చింది. అమెజాన్‌‌‌‌ వీడియోస్ క్లిక్ చేస్తే నెలకు రూ.25 వేలు ఇస్తామంటూ నమ్మించారు. మొదట్లో రూ.2.5 లక్షల వరకు అకౌంట్‌‌‌‌లో డిపాజిట్ చేసింది. ఇలా 2019 వరకు మొత్తం 31 లక్షలు వసూలు చేశారు. గతేడాది నుంచి రిటర్న్స్‌‌‌‌ ఇవ్వడం నిలిపివేశారు. ఈ ఏడాది మళ్లీ ఇన్వెస్ట్‌‌‌‌ చేయించే విధంగా ప్లాన్ చేశారు. రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు డిపాజిట్‌‌‌‌ చేస్తూ నమ్మించారు. దీంతో  బాధితురాలు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


పెళ్లి కూతురికి మేకప్ చేయాలని ట్రాప్ 
పెళ్లి కూతురికి మేకప్ చేయాలని నమ్మించి అమీర్‌‌‌‌‌‌‌‌పేటకి చెందిన ఓ మహిళ వద్ద రూ.1.5 లక్షలు కొట్టేశారు. అడ్వాన్స్ ఇస్తామంటూ గూగుల్​పే రిక్వెస్ట్‌‌‌‌ తీసుకున్నారు. నమ్మించేందుకు ఆర్మీ అధికారులమని చెప్పారు. ముందుగా రూ.5  డిపాజిట్‌‌‌‌ చేసుకుని రూ.10 రిటర్న్ చేశారు. ఆ తర్వాత రూ.20 నుంచి రూ.100 వరకు డిపాజిట్ చేసుకుని రిటర్న్ చేశారు. ఇలా బాధితురాలి నుంచి రూ.1.5 లక్షలు కొట్టేశారు. చివరకు మోస పోయానని గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. 

 

మరిన్ని వార్తల కోసం.. 

 ఇన్వెస్టర్లను వెంటాడుతున్న ఒమిక్రాన్