హైదరాబాద్లో పలు చోట్ల వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్లో పలు చోట్ల వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్

 హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజరాహిల్స్, పంజాగుట్ట, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్,కూకట్ పల్లి,  ఎర్రగడ్డ, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, బేగంపేట, జగద్గిరీ గుట్ట, కుత్బుల్లాపూర్, సుచిత్ర, అల్వాల్, రాయదుర్గం,బహదూర్పల్లి, సూరారం, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, ఆల్విన్ కాలనీ మూసాపేట, ప్రగతినగర్, నిజాంపేటలో  వర్షం పడుతోంది.  

డిసెంబర్ 5 తెల్లవారుజామున నుంచి చిరుజల్లులు పడుతున్నాయి.  పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.  ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో  ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారు. 

స్కూళ్లకు సెలవు

మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. ఇక జగిత్యాల జిల్లాలో కురుస్తోన్న వర్షానికి ధాన్యం అంతా తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆరెంజ్, యెల్లో అలర్ట్

సైక్లోన్ ను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్, యెల్లో అలర్ట్ లు జారీ చేసింది. సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా.. కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, యాదాద్రి భుననగిరి, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, నాగర్ కర్నూల్ జిల్లాలకు మాత్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది.