శ్రీశైలంలో మోంథా తుఫాను అల్లకల్లోలం..అర్థరాత్రి వర్షం బీభత్సం.. కాలనీల్లో మోకాల్లోతు వరద నీరు

శ్రీశైలంలో మోంథా తుఫాను అల్లకల్లోలం..అర్థరాత్రి వర్షం బీభత్సం.. కాలనీల్లో మోకాల్లోతు వరద నీరు

మోంథా తుఫాన్​ బీభత్సం.. అర్థరాత్రి కుండ పోత వర్షం.. విరిగినపడిన కొండచరియలు.. రోడ్లన్నీ బ్లాక్​.. రాకపోకలకు తీవ్ర అంతరాయం.. ఇండ్లలోకి మోకాల్లోతు వరద నీరు..రాత్రి మొత్తం బిక్కుబిక్కుమంటూ గడిపిన ప్రజలు. బుధవారం (అక్టోబర్​29) తెల్లవార్లు ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలం మండంలోని ప్రజల పరిస్థితి. 

ఆంధ్రప్రదేశ్​ లో  మోంథా తుఫాను బీభత్సం సృష్టిస్టోంది. మంగళవారం అర్థరాత్రి కురిసిన భారీ వర్షాలకు పుణ్య క్షేత్రం అయిన శ్రీశైలం , దాని పరిసర ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షం అర్థరాత్రి శ్రీశైలం మండల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. శ్రీశైలంలోని పలు కాలనీల్లో ఇండ్లలోకి మోకాల్లోతు వరద నీరు వచ్చి చేరింది. రోడ్లు కొట్టుకుపోయాయి. జనావాసాల్లోకి భారీ ఎత్తున వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.

ALSO READ : హైదరాబాద్ సిటీలో భారీ వర్షం.. 

 లింగాలగట్టులో మత్య్సకారుల ఇండ్లు నీట మునిగాయి. కొన్ని ఇండ్లు కొట్టుకుపోయాయి. ఓ వైపు వర్షం.. మరోవైపు వరద.. అర్థరాత్రి నిద్ర లేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపారు మత్స్యకారులు. మరోవైపు శ్రీశైలం డ్యాం కు సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు అడ్డుపడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.