‘దబాంగ్ 3’ ప్రీ రిలీజ్ ఫంక్షన్

‘దబాంగ్ 3’ ప్రీ రిలీజ్ ఫంక్షన్

చుల్ బుల్ పాండే.. మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వస్తున్నాడు. సల్మాన్ ఎవర్ గ్రీన్ సినిమా దబాంగ్ నుంచి ఇప్పుడు మూడవ సీక్వెల్ రిలీజ్ అవడానికి రెడీ అయింది. ఈనెల 20వ తారీకున రిలీజ్ అవనున్న ‘దబాంగ్ 3’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ బుధవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమాను సల్మాన్ ఖాన్ ఫిలింస్, అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్ తో పాటు సఫ్రాన్ బ్రాడ్ కాస్ట్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దబాంగ్ 3 ను ప్రభుదేవా దర్శకత్వం వహించగా.. సల్మాన్, సోనాక్షి సిన్హా హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రోడక్షన్ విడుదల చేస్తుంది. ఈ కార్యక్రమానికి తెలుగు హీరోలు వెంకటేష్, రాం చరన్ హాజరయ్యారు.

డైరెక్ట‌ర్ ప్ర‌భుదేవా మాట్లాడుతూ ద‌బాంగ్ 3 ప‌క్కా మాస్‌, యాక్ష‌న్ మూవీలా ఉంటుందని అన్నారు. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుందని చెప్పారు.

హైద‌రాబాద్ ప్ర‌జ‌లు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారని అన్నారు సల్మాన్ ఖాన్. హిందీతో పాటు తన సినిమాలు ఇక్క‌డ కూడా రిలీజ్ అయి… మంచి రెస్పాన్స్ వ‌స్తుండేవని అన్నారు. ఆ రెస్పాన్స్‌ను చూసి ‘ద‌బాంగ్ 3’ని తెలుగులో రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. రామ్‌చ‌ర‌ణ్ తనకు స‌న్నిహితుడని… తన చిన్న‌త‌మ్ముడిగా భావిస్తానని చెప్పారు. చిరంజీవి సార్, వెంకటేశ్‌ సార్ సన్నిహితులని చెప్పారు. ప్ర‌భుదేవా బాగా   డైరెక్ట్ చేశారని… సినిమా త‌ప్ప‌కుండా  అంద‌రికి న‌చ్చుతుంద‌ని తెలిపారు.