మార్చి సెకెండ్ వీక్‌‌లో ‘దహనం’ రిలీజ్

మార్చి సెకెండ్ వీక్‌‌లో ‘దహనం’ రిలీజ్

‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య ఓం ‘దహనం’. చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా దర్శకుడు ఆడారి మూర్తి సాయి రూపొందిస్తున్నాడు. జయశ్రీ హీరోయిన్​. డా.పి.సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. మార్చి సెకెండ్ వీక్‌‌లో సినిమా రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఆదిత్య ఓం మాట్లాడుతూ ‘ప్రతి ఫ్రైడే ఎన్నో సినిమాలు వస్తాయి. కానీ ‘దహనం’ లాంటి చిత్రం పది, ఇరవై ఏళ్లకు ఒక్కసారి వస్తుంది. నాకు ల్యాండ్ మార్క్ సినిమాగా నిలుస్తుందని నమ్మకం ఉంది. మంచి మెసేజ్ ఉన్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు’ అని చెప్పాడు.