దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఆంక్షలు కఠినం చేస్తున్నా వైరస్ కట్టడి సాధ్యం కావడం లేదు. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా బారిన పడుతున్నారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 8,067 కొత్త కేసులు నమోదయ్యయాయి. వీటిలో నాలుగు ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. ఇవాళ 1,766 మంది కోవిడ్ నుంచి కోలుకోగా... 8 మంది మృతి చెందారు. ఇక ముంబైలోనూ రోజులవారీ కేసుల సంఖ్య 47శాతం పెరిగింది. అక్కడ 5,428 మంది కొత్తగా కోవిడ్ బారినపడ్డారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 24,509 యాక్టివ్ కేసులున్నాయి.
కేరళలోనూ కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 2,676 మందికి కోవిడ్ సోకింది. కరోనా కారణంగా శుక్రవారం 11మంది చనిపోయారు. ప్రస్తుతం కేరళలో 19,416 యాక్టివ్ కేసులున్నాయి.
బెంగాల్లో ఈ రోజు 3,451 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,510 మంది కోలుకోగా.. ఏడుగురు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,710 కేసులు క్రియాశీలంగా ఉన్నాయి.
చండీఘడ్ లో గత 24 గంటల్లో 49 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 170 యాక్టివ్ కేసులున్నాయి.

మరిన్ని వార్తల కోసం..


విజయ పాల ధరలు పెంపు

పళ్లతో కారును లాగేసిన పులి