Good Health : రోజూ వాడే తువ్వాళ్లు ఇట్ల వాడాలె

Good Health : రోజూ వాడే తువ్వాళ్లు ఇట్ల వాడాలె

తువ్వాళ్లు ఎప్పుడు? ఎలా వాడాలి? ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి? ఎలా క్లీన్ చేసుకోవాలి? తుడుచుకుని పక్కన పడేసే తుండుకి ఇన్ని రూల్సా? అనిపిస్తుందా? అట్లయితే ఈ డిటెయిల్స్ చదవాల్సిందే...

* చేతులు కడుక్కున్నా, ముఖం శుభ్రం చేసుకున్నా, స్నానం చేసినా వెంటనే తువ్వాలు కావాలి. దీంతో మన ఒంటిమీద ఉన్న ఫంగస్ టవల్స్ కు అంటుకుంటుంది. 

* స్నానం చేసిన తర్వాత టవల్తో తుడుచుకున్నప్పుడు బ్యాక్టీరియా, నీళ్లు, డెడ్ స్కిన్ ఫ్యాబ్రిక్కి అతుక్కుంటాయి. దానివల్ల కొత్త హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే తువ్వాల్ని పిల్లలకు వాడారనుకోండి టవల్కు ఉన్న డెడి స్కిన్, బ్యాక్టీరియా పిల్లల చర్మం మీదకు చేరి పొట్టచుట్టూ, తలలో, చేతులపైన ర్యాషెస్ వస్తాయి.

* తామర, కురుపులు లాంటి సమస్యలు వస్తాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు కచ్చితంగా తువ్వాల్ని శుభ్రం చేయాలి. లేదంటే ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందుకే, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతికి ఎండలో ఆరేయాల్సిందే. 

* వారానికి మూడుసార్లు వాటిని ఉతకడం తప్పనిసరి. ఒకసారి తుడుచుకున్న తర్వాత ఎండలో వేసి ఆరాకనే మళ్లీ వాడాలి. పిల్లలకు వేరే తువ్వాలు వాడాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే స్కిన్ ఎలర్జీలు రాకుండా, బ్యాక్టీరియా దరికి రాకుండా ఉంటుంది.