
మంచిర్యాల, వెలుగు: తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో డైలీ వేజ్ వర్కర్లుగా పని చేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ లేబర్, మైనింగ్ మినిస్టర్ జి.వివేక్ వెంకటస్వామిని కోరారు. మంచిర్యాలలోని ఆఫీసులో ఆదివారం వినతిపత్రాన్ని మంత్రి పీఏ రాకేశ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న వివిధ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.