మధిర, వెలుగు: కరెంట్ షాక్ తో సుతారి కూలీ చనిపోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిరలో జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మధిర మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన కాకర్ల తిరుపతిరావు (35) మధిరలో ఒక అపార్ట్మెంట్ నిర్మాణంలో సుతారి కూలీగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఇసుకను ఎలక్ట్రానిక్ జల్లెడతో పడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అతడు అక్కడికక్కడే చనిపోయాడు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మధిరలో మృతుడి కుటుంబ సభ్యులు, బధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం కోసం డెడ్‌బాడీని మధిర ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.