కరెంట్ షాక్ తో పాడి ఆవు మృతి

కరెంట్ షాక్ తో పాడి ఆవు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా: కరెంట్ షాక్ తో పాడి ఆవు మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. భువనగిరి మండలంలోని, కూనూరు గ్రామంలో పాడి రైతు నుచ్చు లక్ష్మీకి చెందిన ఆవు కరెంట్ షాక్ తో మృతి చెందింది. శనివారం రాత్రి కురిసిన వర్షానికి విద్యుత్ తీగలు కిందకి వేలాడాయి. అయితే మేతకు వెళ్లిన ఆవుకు కరెంట్ తీగలు తగలడంతో స్పాట్ లోనే చనిపోయిందని తెలిపారు ఆ గ్రామ ఎంపీటీసీ పాశం శివానంద్. దీంతో లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.