
చంపావత్ (ఉత్తరాఖండ్): దళిత మహిళ వండిన ఫుడ్ తినడానికి అగ్రకులాలకు చెందిన స్టూడెంట్లు నిరాకరించడంతో ఆమెను విధుల నుంచి తొలగించారు. ఉత్తరాఖండ్ చంపావత్ జిల్లాలోని సుఖిదాంగ్ సర్కారు బడిలో ఇటీవల ఈ ఘటన జరిగింది. స్టూడెంట్లకు ఫుడ్ వండిపెట్టడానికి ‘భోజన్‌మాత’గా దళిత మహిళను ఈ నెల ప్రారంభంలో అపాయింట్ చేశారు. దీంతో ఆ స్కూల్‌లోని 66 మందిలో 40 మంది స్టూడెంట్లు ఇంటి నుంచి బాక్స్‌లు తెచ్చుకోవడం స్టార్ట్ చేశారు. స్టూడెంట్ల పేరెంట్స్ కూడా దళిత మహిళ నియామకాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆమె అపాయింట్‌మెంట్‌ను ఉన్నతాధికారులు క్లియర్ చేయలేదని, అయినా ఉద్యోగం ఇచ్చారని చంపావత్ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆర్‌సీ పురోహిత్ చెప్పారు. నియామకాల్లో రూల్స్ ఫాలో కాలేదని, అందుకే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించామన్నారు.