
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ కు చెందిన దళిత నేత మాదిగ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న ఆదివారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ తోనే దళితుల అభివృద్ధి సాధ్యమని నమ్మి పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు.