రోడ్​షో నిర్వహించిన దాల్మియా సిమెంట్స్

రోడ్​షో నిర్వహించిన దాల్మియా సిమెంట్స్

హైదరాబాద్​, వెలుగు: దాల్మియా సిమెంట్ తన ప్రొడక్టులను సమర్థంగా వాడేలా బిల్డర్లకు, కస్టమర్లకు అవగాహన కలిగించడానికి ‘రూఫ్​ కాలమ్​ ఫౌండేషన్​ (ఆర్​సీఎఫ్​) తో స్ట్రాంగ్​ఘర్​’ పేరుతో హైదరాబాద్​లో సోమవారం రోడ్​షో నిర్వహించింది. 

బాలీవుడ్​ నటుడు  రణవీర్ సింగ్​ను బ్రాండ్​ అంబాసిడర్​గా నియమించినట్టు కంపెనీ ప్రకటించింది.  ఈ సందర్భంగా కంపెనీ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ ఒకరు మాట్లాడుతూ రీబ్రాండింగ్​ కోసం దేశంలోని 75 నగరాల్లో రోడ్​షోలు నిర్వహిస్తున్నామని అన్నారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తాము 14–-15 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.