డాన్స్ దీవానే జూనియర్ 

డాన్స్ దీవానే జూనియర్ 

హిందీలో ‘డాన్స్ దీవానే’ రియాలిటీ షో సక్సెస్​ కావడంతో  సరికొత్త డాన్స్ షో ప్లాన్ చేస్తోంది కలర్స్​ టీవీ. ఈ కొత్త షో పేరు ‘డాన్స్​ దీవానే జూనియర్’ షో. నాలుగేండ్ల నుంచి పద్నాలుగేండ్ల లోపు పిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. సోలో, గ్రూప్​, డ్యుయెల్​ డాన్స్​ పర్ఫార్మెన్స్ ఇవ్వొచ్చు. ఈ షోని బాలీవుడ్ యాక్టర్​ నీతూ సింగ్, నీనా గుప్తా, డాన్సర్ నోరా ఫతేహి, కొరియోగ్రాఫర్ మర్జీ పెస్తోంజీ జడ్జ్​లుగా చేయనున్నారు. ఈ షోకి సంబంధించిన ఫస్ట్ ప్రోమో వచ్చింది.  అందులో  స్కూల్ టీచర్​గా ఉన్న నోరా ఫతేహి క్లాస్ రూమ్ సెటప్​ చూసి చిరాకు పడుతుంది. గంట మోగగానే పిల్లలు, నోరా కూడా డాన్స్​ మూడ్​లోకి వెళ్తారు. వెంటనే క్లాస్​ రూమ్ కాస్త డాన్స్​ స్టేజ్​ అవుతుంది. డాన్స్​ ఫ్లోర్​ మీద ‘టిప్​ టిప్​ బర్సా పానీ’ పాటకు ఒక చిన్న పాప, నోరా ఇద్దరూ పోటాపోటీగా డాన్స్​ చేస్తారు. ‘దీవాన్​గీ మోర్. డాన్స్ హార్డ్​కోర్​’ ట్యాగ్​లైన్​తో ప్రోమో ముగుస్తుంది. త్వరలోనే ఈ షో కలర్స్​, వూట్​లో టెలికాస్ట్ అవనుంది.