ఎన్టీఆర్, హృతిక్ మధ్య డ్యాన్స్ వార్..

ఎన్టీఆర్, హృతిక్ మధ్య డ్యాన్స్ వార్..

గ్లోబల్ లెవల్‌‌‌‌లో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. వాటిలో  హృతిక్ రోషన్‌‌‌‌తో  కలిసి ‘వార్‌‌‌‌‌‌‌‌2’లో  నటిస్తున్న తారక్ ఈ చిత్రంతో బాలీవుడ్  ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మోస్ట్‌‌‌‌ అవెయిటింగ్‌‌‌‌  స్పై యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌లో‌‌‌‌  కియారా అద్వాని హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో  యశ్ రాజ్ ఫిల్మ్స్‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై ఆదిత్యా చోప్రా  నిర్మిస్తున్నారు.  

ఆగస్టు 14న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా సినిమా విడుదల కానుంది.  దాదాపు షూటింగ్ పూర్తయింది. తాజాగా ఎన్టీఆర్, హృతిక్ మధ్య ఓ మాస్ డ్యాన్స్‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌ను షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో వేసిన స్పెషల్ సెట్‌‌‌‌లో  ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది.  బాలీవుడ్‌‌‌‌లో హృతిక్ డ్యాన్స్‌‌‌‌కు, అలాగే సౌత్‌‌‌‌లో ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ డ్యాన్స్‌‌‌‌కు మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.  ఇప్పుడు వీరిద్దరి మధ్య వచ్చే ఈ సాంగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌‌‌‌గా నిలవనుందని తెలుస్తోంది. 

ప్రీతమ్ ఈ సాంగ్ కంపోజ్ చేయగా, బాస్కో, సీజర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, హృతిక్  మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌లను టీజర్ ద్వారా చూపించి సినిమాపై అంచనాలు  పెంచారు మేకర్స్.  అందరి అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా లైఫ్ టైమ్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్ ఇచ్చేలా ఈ  సినిమా ఉంటుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు. మరోవైపు ఈ మూవీ తెలుగు రైట్స్‌‌‌‌ను నిర్మాత సూర్యదేవర నాగవంశీ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.