
ఆదిలాబాద్, వెలుగు : ప్రతి ఏడాది దీపావళి పండగ సందర్భంగా ఆదివాసీలు జరుపుకునే దండారీ ఉత్సవాలకు వందేండ్ల చరిత్ర ఉందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడాల్లో దండారీ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
మావల మండలం పరిధిలోని కొమరం భీం కాలనీలో సోమవారం జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఆదివాసీలతో కలిసి ఎమ్మెల్యే గుస్సాడీ నృత్యాలు చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర కో–కన్వీనర్ గోడం గణేశ్, బీజేపీ నాయకులు ముకుంద్, అశోక్ రెడ్డి, మయూర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.