వలలో చిక్కిన డేంజరస్‌‌‌‌‌‌‌‌ షార్క్‌‌‌‌‌‌‌‌

వలలో చిక్కిన డేంజరస్‌‌‌‌‌‌‌‌ షార్క్‌‌‌‌‌‌‌‌

జాలర్లు రోజూ ఎన్నో రకాల చేపలను వలేసి పడుతూ ఉంటారు. అయితే బ్రిటన్​కు చెందిన ఫిషర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేన్‌‌‌‌‌‌‌‌ డేవిడ్‌‌‌‌‌‌‌‌ సన్‌‌‌‌‌‌‌‌ జాక్​పాట్​ కొట్టాడు. రెండు రోజుల పాటు పెద్ద చేపను పట్టడానికి బోట్‌‌‌‌‌‌‌‌ వేసుకుని తిరిగిన అతని అదృష్టం పండింది. ఎప్పుడో కాని, ఎవరికో కాని దొరకని ఏడు ఫీట్ల ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీగల్‌‌‌‌‌‌‌‌ షార్క్‌‌‌‌‌‌‌‌ అతని వలలో పడింది. షార్క్‌‌‌‌‌‌‌‌ జాతిలో డాన్‌‌‌‌‌‌‌‌ లాంటి ఈ ఫిష్​ చాలా ప్రమాదకరమైనది. అలాంటి షార్క్​ దొరకడంతో అతని ఆనందానికి అంతులేకుండా పోయింది.  యూకేలోని డేవన్‌‌‌‌‌‌‌‌ తీరంలో 249 కిలోలున్న ఈ షార్క్‌‌‌‌‌‌‌‌ డేవిడ్‌‌‌‌‌‌‌‌ సన్‌‌‌‌‌‌‌‌ వలలో చిక్కింది. ఈ విషయాన్ని సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ.. ‘‘సాధారణంగా ఈ షార్క్‌‌‌‌‌‌‌‌ ​లు 5 నుంచి 7 ఫీట్ల వరకూ ఉంటాయి. నాకు సెవెన్‌‌‌‌‌‌‌‌ ఫీట్‌‌‌‌‌‌‌‌ షార్క్ దొరకడం నిజంగా నమ్మలేని విషయం. ఇది రికార్డ్‌‌‌‌‌‌‌‌ బ్రేకింగ్‌‌‌‌‌‌‌‌ కూడా.  ఇదేమీ అంత ఈజీగా నా వలలో చిక్కలేదు, గంట సేపు పైగా దీంతో ఫైట్‌‌‌‌‌‌‌‌ చేశా.. నా శరీరమంతా గాయాలు కూడా అయ్యాయి. అయినా లెక్క చేయలేదు. నా లైఫ్​లో ఇలాంటి చేప పట్టుకొని తీరాలి అనుకున్నా! అందుకే దీంతో అంత ఫైట్‌‌‌‌‌‌‌‌ చేశా..! చివరకు సాధించా” అని చెప్పాడు. గుంపులు గుంపులుగా నివసించే షార్క్‌‌‌‌‌‌‌‌లు వలలో పడటం అంత సులువుగా జరగదు. చాలా అరుదుగా ఇవి వలలో చిక్కుతాయి. అందుకే డేవిడ్‌‌‌‌‌‌‌‌ అంత ఫైట్‌‌‌‌‌‌‌‌ చేశాడు.. చివరకు దానిని పట్టేశాడు.. రికార్డు సాధించాడు.