అలర్ట్: తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు

అలర్ట్:  తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు

తెలంగాణలో ఇవాళ,రేపు  భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని.. మార్చి 20న ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.   పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. 

భారీ వర్షాల హెచ్చరికతో   హైదరాబాద్ లో ఇవాళ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అకస్మాత్తుగా చల్లబడింది. మధ్యాహ్నమే  చీకటి వాతావరణం కనిపిస్తోంది.   కొన్ని ప్రాంతాల్లో చల్లటి ఈదురుగాలులు వీస్తున్నాయి,  హైదరాబాద్‌లో బుధవారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని ..  ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.  హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు ఏ మేరకు తగ్గుతాయో వేచి చూడాలి.

ALSO READ :- Healthy Food : నూనె లేకుండా పుల్ల మజ్జిగతో కాకరకాయ ఫ్రై తయారీ..