ఊహించని ట్విస్టులతో డార్క్ నైట్.. ఉత్కంఠ రేపుతోన్న స్టోరీ

ఊహించని ట్విస్టులతో డార్క్ నైట్.. ఉత్కంఠ రేపుతోన్న స్టోరీ

హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్ర పోషించిన ఎమోషనల్ థ్రిల్లర్ ‘డార్క్ నైట్’.  జీఆర్  ఆదిత్య దర్శకత్వంలో  సురేష్ రెడ్డి కొవ్వూరి నిర్మించారు. త్రిగుణ్, విధార్థ్, సుభాశ్రీ రాయగురు ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని  మార్చి 13న   విడుదల చేయనున్నట్టు తెలియజేశారు మేకర్స్. 

ఈ సందర్భంగా నిర్మాత సురేష్ రెడ్డి మాట్లాడుతూ ‘ఈ కథ నాలుగు  పాత్రల జీవితాల చుట్టూ తిరుగుతుంది. వారి మధ్య ఉన్న సంక్లిష్ట భావోద్వేగాలు, రహస్యాలు, సంఘర్షణలు, కథను ఉత్కంఠభరితంగా మలుస్తాయి. ఈ చిత్రంలో అతీంద్రియ అంశాలతో కూడిన ఒక ఊహించని ట్విస్ట్ ఉంటుంది. మిస్కిన్ అందించిన బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోరు ఆడియెన్స్‌‌‌‌కు కొత్త ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌ను అందిస్తుంది’ అని చెప్పారు.