కాశీ విశ్వనాథుని దర్శనాలు నిలిపివేత

V6 Velugu Posted on Nov 25, 2021

ఉత్తరప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథుని దర్శనాలను మూడు రోజులపాటు నిలిపివేయనున్నారు  ఆలయాధికారులు. ఆలయ పునరుద్ధరణ, సుందరీకరణలో భాగంగా ఆలయాన్ని మూసివేయనున్నారు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు భక్తుల దర్శనాలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో భక్తుల దర్శనాలను పూర్తిగా నిలిపివేయడం ఆలయ చరిత్రలో ఇది రెండోసారి. గతంలో కరోనా కారణంగా మొదటిసారి మూసివేశారు.

గర్భగుడిలో రాతి కట్టడంపై పెయింట్ తొలగించేందుకు పాలిషింగ్‌ పనులు చేపట్టనున్నారు ఆలయ సిబ్బంది. నవంబర్ 29, 30 తేదీల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శనాలను నిలిపిచేయనున్నారు. డిసెంబర్ 1 తెల్లవారుజాము నుంచి డిసెంబర్ 2 ఉదయం 6 గంటల వరకు పూర్తిగా దర్శనాలు నిలిపివేస్తారు. ఈ సమయంలో గర్భగుడి లోపలి గోడలను శుభ్రం చేయనున్నారు. ఆలయ విస్తరణ, సుందరీకరణ పనులను డిసెంబర్ 13లోపు పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు.

Tagged suspended, three days,  Kashi Vishwanath, Darshan

Latest Videos

Subscribe Now

More News