డార్విన్బాక్స్ మూడో ఈసాప్‌‌‌‌‌‌‌‌ బైబ్యాక్‌‌‌‌‌‌‌‌

డార్విన్బాక్స్ మూడో ఈసాప్‌‌‌‌‌‌‌‌ బైబ్యాక్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఏఐ ఆధారిత హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ అందించే హైదరాబాద్​కంపెనీ డార్విన్‌‌‌‌‌‌‌‌ బాక్స్‌‌‌‌‌‌‌‌ రూ.86 కోట్ల ఎంప్లాయీ స్టాక్‌‌‌‌‌‌‌‌ ఓనర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ (ఈసాప్​) బైబ్యాక్‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేసింది. నాలుగేళ్ల కాలంలో ఇది మూడో బైబ్యాక్‌‌‌‌‌‌‌‌. 11 గ్లోబల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసుల్లో పనిచేస్తున్న 350కిపైగా ఉద్యోగులు ఈ బైబ్యాక్‌‌‌‌‌‌‌‌ ద్వారా లబ్ధి పొందనున్నారు.   కంపెనీ విలువను పెంచేవారికి తగ్గ భాగస్వామ్యమూ ఉండాలన్నది డార్విన్‌‌‌‌‌‌‌‌బాక్స్‌‌‌‌‌‌‌‌ విధానమని,  ఉద్యోగులకు అర్థవంతమైన ఫలాలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని  డార్విన్‌‌‌‌‌‌‌‌ బాక్స్‌‌‌‌‌‌‌‌ కో–ఫౌండర్​ జయంత్‌‌‌‌‌‌‌‌ పాలేటి చెప్పారు.

2025 మార్చిలో డార్విన్‌‌‌‌‌‌‌‌ బాక్స్‌‌‌‌‌‌‌‌ 140 మిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్ల డీల్‌‌‌‌‌‌‌‌తో ఒక గ్లోబల్‌‌‌‌‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ ఈక్విటీ కంపెనీతోపాటు కేకేఆర్‌‌‌‌‌‌‌‌లతో చేతులు కలిపింది.  ఇది  వెయ్యికిపైగా ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌‌‌‌‌లోని 40 లక్షల మంది ఉద్యోగులకు అత్యాధునిక హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీలను అందిస్తోంది.  స్టార్‌‌‌‌‌‌‌‌బక్స్‌‌‌‌‌‌‌‌, మెక్‌‌‌‌‌‌‌‌డొనాల్డ్స్‌‌‌‌‌‌‌‌, ఏఎక్స్సే, సిగ్నా, వీవర్క్‌‌‌‌‌‌‌‌, ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌, వేదాంత వంటి బ్రాండ్‌‌‌‌‌‌‌‌లు డార్విన్‌‌‌‌‌‌‌‌బాక్స్‌‌‌‌‌‌‌‌ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ను వాడుతున్నాయి.