ఏడాది కాలం  దమ్ము ధూళిలో చాలా కష్టాలు : నాని

ఏడాది కాలం  దమ్ము ధూళిలో చాలా కష్టాలు : నాని

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దసరా’. సుధాకర్ చెరుకూరి నిర్మాత. కీర్తి సురేష్ హీరోయిన్‌‌‌‌. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మార్చి 30న రిలీజ్ కానుంది. ఆదివారం సాయంత్రం అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈసందర్భంగా నాని మాట్లాడుతూ ‘ఇన్ని రోజులు మిమ్మల్ని మెప్పించే మాస్ చూసి ఉంటారు. ‘దసరా’తో మీ మనసుకు హత్తుకునే మాస్ చూపిస్తాను. ఇది నా ప్రామిస్. కళ్ళల్లో చిన్న గ్లిట్టర్‌‌‌‌‌‌‌‌తో విజిల్స్ వేసే ఆనందం దసరాతో ఎక్స్‌‌‌‌పీరియన్స్ చేస్తారు. దసరా నా మనసుకు దగ్గరైనా సినిమా. ఏడాది కాలం  దమ్ము ధూళిలో చాలా కష్టాలు పడి టీం అంతా హార్డ్ వర్క్ చేశాం. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌‌‌‌ని రూపొందించిన నిర్మాత సుధాకర్, దర్శకుడు శ్రీకాంత్‌‌‌‌కి థ్యాంక్స్’ అని చెప్పాడు.

కీర్తి సురేష్ మాట్లాడుతూ ‘నాని, నేను కలిసి ‘నేను లోకల్’ సినిమా చేశాం. కానీ నాకు ‘దసరా’నే లోకల్ అనిపిస్తుంది. నాని నా  బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ కో యాక్టర్. ఈ  సినిమాతో అందరికీ వెన్నెలగా గుర్తుంటాను’ అని చెప్పింది. నటుడు దీక్షిత్ శెట్టి, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా, లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.