దసరా ఫస్ట్ డే కలెక్షన్స్.. దుమ్ములేపాడుగా నానీ

దసరా ఫస్ట్ డే కలెక్షన్స్.. దుమ్ములేపాడుగా నానీ

శ్రీరామ నవమికి వచ్చిన హీరో నాని దసరా మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ దుమ్మురేపాయి. ఊహించిన దాని కంటే ఎక్కువగా వచ్చినట్లే సినీ ఇండస్ట్రీ టాక్. నవమి వేడుకలు ఉండటంతో హౌస్ ఫుల్స్ అవుతాయా లేదా అనే భయం వెంటాడింది. వారి అంచనాలను పటాపంచలు చేస్తూ.. అన్ని థియేటర్లు ఫుల్ అయ్యాయి. మార్చి 30వ తేదీ తెలుగు రాష్ట్రాల్లో దసరా కలెక్షన్స్ ఏ విధంగానే చూద్దాం..

ఏపీ, తెలంగాణలో మొత్తం 14 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టగా.. ఇందులో నైజాం నుంచి రూ 6.78 కోట్లు, సీడెడ్ – రూ.2.36 కోట్లు, ఉత్తరాంధ్ర – రూ.1.42 కోట్లు, ఈస్ట్ – రూ.90 లక్షలు,వెస్ట్ – రూ. 55 లక్షలు, గుంటూరు – రూ.1.22 కోట్లు, కృష్ణ – రూ. 64 లక్షలు, 
నెల్లూరు – రూ.35 లక్షలుగా ఉంది.

ఇక ఓవర్ సీస్ మార్కెట్ చూస్తే.. అమెరికా వ్యాప్తంగా 400 షోలు వేయగా.. ప్రీమియర్ షోలు, ఫస్ట్ డే కలెక్షన్స్ మొత్తంగా 7 లక్షల డాలర్ల వరకు వసూలు అయినట్లు చెబుతున్నారు. నానీ కెరీర్ లోనే ఫస్ట్ డే కలెక్షన్స్ లో దసరా మూవీ రికార్డ్స్ అనేది సినీ ఇండస్ట్రీ టాక్. ఓవరాల్ గా ఫస్ట్ డే 15 కోట్ల రూపాయల వరకు వసూలు చేయటం విశేషం.

దీంతో యూనిట్ మొత్తం సంబరాల్లో ఉంది. శుక్ర, శని, ఆదివారం ఇలా వరసగా మూడు రోజులు వీకెండ్ రావటంతో కలెక్షన్స్ భారీగా ఉంటాయనే అంచనాలో ఉన్నారు నిర్మాతలు. దీనికితోడు కొత్త సినిమాలు ఏవీ కూడా లేకపోవటం కూడా దసరాకు కలిసి వచ్చిందనేది ఇండస్ట్రీ టాక్.

ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.