సంధ్య థియేటర్లో నాని హంగామా

సంధ్య థియేటర్లో నాని హంగామా

నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిత్రం ‘దసరా’. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గురువారం రిలీజైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ RTC గ్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్ దగ్గర హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సందడి చేశారు. అభిమానులు, ప్రేక్షకులతో కలిసి మార్నింగ్ షో చూశారు. థియేటర్‌లో తన నటన, పాటలకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి నాని సంతోషం వ్యక్తం చేశాడు.

హీరో నానిని చూసేందుకు అభిమానులు భారీగా రావడంతో సుదర్శన్ థియేటర్ దగ్గర కోలహలంగా ఉంది. ఇక ఈసినిమాను ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయనణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.