ఒకటో తారీఖున జీతాలివ్వలేని పరిస్థితి ఎందుకుంది?

ఒకటో తారీఖున జీతాలివ్వలేని పరిస్థితి ఎందుకుంది?

పండుగ పూటైనా సరైన సమయానికి జీతాలు, పెన్షన్లు ఇవ్వాలని బీజేపీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఎందుకుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

దసరా పండుగకైనా జీతాలు వస్తాయా లేదా అని ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారని దాసోజు శ్రవణ్ అన్నారు. గతేడాది కూడా దసరా పండుగకు జీతాలు ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. సమయానికి జీతం రాక అప్పులు చేస్తున్న ఉద్యోగులు వచ్చిన జీతాన్ని వడ్డీలకు కట్టి ఆర్థిక సమస్యల్లో చిక్కుకుపోతున్నారని శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ, దసరా పండుగలున్నందున కుటుంబ అవసరాల కోసం ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు అక్టోబర్ 1న చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.