
హైదరాబాద్, వెలుగు: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తమ నామినేషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికైనా హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని గవర్నర్‌కు విజ్ఞ ప్తి చేశారు. మన చట్టాలలో సమానత్వానికి అద్దం పట్టిన ఈ తీర్పు రాజ్యాంగ ప్రయాణంలో మైలురాయి అని పేర్కొన్నారు. ‘‘సమాజానికి మేలు చేయాలనేది మా సంకల్పం. సమాజానికి తోడ్పాటు అందించాలనేది మా ప్రయత్నం’’ అని శ్రవణ్ వెల్లడించారు.