111జీవో రద్దుతో హుస్సేన్ సాగర్లా జంట జలాశయాలు

111జీవో రద్దుతో హుస్సేన్ సాగర్లా జంట జలాశయాలు

111జీవోపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. జీవో 111పై హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని ఏఐసీసీ జాతీయ కార్యదర్శి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. 111జీవోపై 2016లో హైపర్ కమిటీ ఏర్పాటు చేయగా.. 2022 మార్చి 31న కమిటీ రిపోర్టు ఇచ్చినట్లు ప్రభుత్వం జీవోలో తెలిపింది. అయితే ఆ రిపోర్టులో పొందుపరిచిన అంశాలను బహిర్గతం చేయాలని అన్నారు. జీవో రద్దుతో నగరంలోని జంట జలాశయాలు కూడా మరో హుస్సేన్ సాగర్ లా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలో నాయకులు ప్రజా సమస్యలపై చర్చించకుండా.. తిట్ల రాజకీయాలు నడుపుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా పేరుతో చైనా కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెడుతోందని దాసోజు ఆరోపించారు. 

మరిన్ని వార్తల కోసం..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై గంగుల ఫైర్

పబ్ కేసులో నిందితులను విచారిస్తున్న పోలీసులు