ఓడిన్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌లో డేటా సైన్స్ కోర్సులు

ఓడిన్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌లో డేటా సైన్స్ కోర్సులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: డేటా సైన్స్‌‌‌‌‌‌‌‌, వెబ్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కోర్సులను నేర్పుతున్న ఓడిన్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌ శనివారం  అలూమ్నీ సక్సెస్ మీట్‌‌‌‌‌‌‌‌ 2‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌023 ని నిర్వహించింది. ఈ ఏడాది వివిధ కోర్సుల్లో జాయిన్ అయ్యి జాబ్స్ పొందిన స్టూడెంట్లు ఈ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్నారు. అంతేకాకుండా ఓడిన్‌‌‌‌‌‌‌‌స్కూల్  ఇండస్ట్రీ  ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్టులను తీసుకొచ్చి వారితో మాట్లాడించింది.

డేటా సైన్స్ కోర్సులు చెప్పడంలో  గత రెండేళ్లలో భారీగా విస్తరించామని కంపెనీ సీఈఓ విజయ్‌‌‌‌‌‌‌‌ పసుపులేటి అన్నారు. ప్రస్తుతం ఆరు నెలల బూట్‌‌‌‌‌‌‌‌క్యాంప్‌‌‌‌‌‌‌‌ కోర్సులను ఆఫర్ చేస్తున్నామని చెప్పారు.  కోర్సులు నేర్పించాక జాబ్స్ ఇప్పించడంలో కూడా స్టూడెంట్లకు సాయపడతామని చెప్పారు. కోర్సు పూర్తయిన డేట్  నుంచి రెండేళ్ల వరకు ఈ సాయం చేస్తామని  వివరించారు.