
న్యూఢిల్లీలోని షిల్లాంగ్‌కు చెందిన డేబ్ ఆర్తీ చక్రవర్తి తన.. 50 ఏళ్ల తల్లికి రెండో వివాహం చేసింది. తండ్రి మరణానంతరం తల్లి మౌషుమి చక్రవర్తి ఒంటరిగా ఉంటున్నారు. దీంతో డేబ్ ఆర్తీ తన తల్లిని మళ్లీ పెళ్లి చేసుకోమని చాలాసార్లు కోరింది. చివరకు 50 ఏళ్ల వయస్సులో ఆమె అంగీకరించింది. ఆమె తన సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.
తన తండ్రి షిల్లాంగ్‌లో వైద్యుడిగా పనిచేసేవారని డేబ్ ఆర్తీ చెప్పారు. తన చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో.. తన తల్లి తనను పెంచుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడిందని ఆమె చెప్పింది. తన తండ్రి చనిపోయినప్పుడు ఆమె వయస్సు 2 సంవత్సరాలు. తన తండ్రి చనిపోవడంతో.. అమ్మతో కలిసి అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉండేవాళ్లమని చెప్పింది. ఈ వివాహం ద్వారా తన తల్లి హ్యపీగా ఉంటుందని డేబ్ ఆర్తీ తెలిపింది. తన తండ్రి మరణానంతరం ఆస్తి విషయంలో కుటుంబంలో గొడవలు వచ్చాయని, ఈ విషయాలన్నింటిలో తన తల్లి నలిగిపోయిందని చెప్పింది. రెండో పెళ్లికి తల్లిని ఒప్పించేందుకు చాలా సమయం పట్టిందని తెలిపింది. ఈ ఏడాది తనకు బెంగాల్‌కు చెందిన స్వపన్‌తో వివాహమైందని, పెళ్లి తర్వాత ఇప్పుడు సంతోషంగా ఉన్నానని డేబ్ ఆర్తీ తెలిపింది.