29 ఏళ్లకే రూ. 8 కోట్ల అప్పు.. ఇలా ఇచ్చారు.. ఇప్పుడెలా కట్టాలి..

29 ఏళ్లకే రూ. 8 కోట్ల అప్పు.. ఇలా ఇచ్చారు.. ఇప్పుడెలా కట్టాలి..

ఇదివరకు అప్పు అంటే.. తెగ భయపడేవాళ్లు. చిన్న మొత్తంలో అప్పు చేసినా తీర్చేవరకు నిద్రపోయేవాళ్లు కాదు. అవరాలకు మించి ఖర్చు చేయకుండా.. తమకు ఉన్నంతలోనే బతికేవాళ్లు. కానీ, ఇప్పుడు కాలం మారింది. ఆడంబరాలకు పోయి స్థాయికి మించిన అప్పులు చేస్తున్నారు. వచ్చే జీతం మొత్తం క్రెడిట్ కార్డు బిల్లు, ఈఎంఐలకే ఖర్చు చేస్తున్నారు. చాలి చాలని డబ్బుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్క వాళ్లలా బతకాలనే ఆశకు పోయి.. అప్పు అనే ఊబిలో చిక్కుకుపోతున్నారు. అలాంటి ఓ ఘటనే అమెరికాలో జరిగింది. కేవలం 29 ఏళ్లలోనే రూ.8 కోట్లకు పైగా అప్పులు చేసి ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

అమెరికాలోని రెడియోలో పాల్గొన్న ఆర్థిక సలహాదారుడు Dave Ramsey సాయం కోరి ఓ జంట రేడియో సెంటర్ కి కాల్ చేసింది. వాళ్లు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నట్లు.. చెప్తూ తమ అప్పుకు గల కారణాన్ని వివరించారు. ఆ జంట అప్పులు తీసుకుని సొంత ఇల్లు, కారును కొనుకొన్నారు. క్రెడిట్ కార్డ్ బిల్లు కొండంత పెరిగిపోయింది. ఇలా రిచ్ లైఫ్ కు అలవాటు పడి అప్పుచేసి కావాల్సినవన్నీ  కొనుకున్నారు. దాంతో స్థాయికి మించిన అప్పులు పెరిగిపోయాయి.  

చివరికి తమ తప్పు తెలుసుకున్న ఆ జంట.. ఆర్థిక సలహా కొరకు రామ్సేకు కాల్ చేశారు. వాళ్లు చేసిన తప్పు విన్న రామ్సే.. ఇంక అప్పులు తీసుకోవడం, వస్తువులు కొనడం  ఆపాలని సూచించాడు. రాబోయే మూడేళ్లపాటు కొత్త వాటిపై ఎలాంటి ఖర్చులు చేయొద్దని సలహా ఇచ్చాడు. రామ్సీ ఆ జంటతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మితి మీరిన ఖర్చులు చేసేవాళ్లకు ఈ జంట ఒక ఎగ్జాంపుల్ అంటూ రామ్సే అన్నారు. అప్పులు తీసుకోవడం తప్పుకాదని.. కాకపోతే అవసరాలకు, తాహత్తుకు మించి తీసుకోవడం తప్పని సూచించాడు.