బుట్టబొమ్మ పాటకు తన ఫ్యామిలీతో కలిసి స్టెప్పులేసి అందరినోటా పడ్డాడు ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్. ఆ తర్వాత తెలుగు సినిమాలలోని పలు పాటలకు డ్యాన్స్ చేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. దాంతో వార్నర్‌కి యమా క్రేజ్ వచ్చింది. లాక్‌డౌన్‌ను పలువురు పలు విధాలుగా ఉపయోగించుకుంటే.. వార్నర్ మాత్రం సౌత్ సినిమాలను వాడుకొని అందరిని ఆకర్షించాడు. పాత సంవత్సరం 2020ని సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలోని మహేష్ క్యారక్టర్‌ని ఇమిటేట్ చేసి సెండ్ ఆఫ్ ఇచ్చాడు. డిసెంబర్ 31న ఆ వీడియోను పోస్ట్ చేసి ఇదే ఈ సంవత్సరపు చివరి వీడియో అని పోస్ట్ చేశాడు.
తాజాగా కొత్త సంవత్సరానికి వెల్‌కమ్ చెబుతూ.. జనవరి 1న దర్బార్ సినిమాలోని రజనీకాంత్ గెటప్‌ని ఇమిటేట్ చేసి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. ‘చాలామంది కోరిక మేరకు ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://www.v6velugu.com/wp-content/uploads/2021/01/134350494_149226493421573_3846328130892879226_n.mp4
For More News..
కరోనాతో పాటు అన్ని వైరస్‌లు ఖతం చేసే బయో స్టెర్ల్ ఎయిర్
ఇంకో రెండు టీ20 వరల్డ్‌కప్‌ల్లో ఆడతా
