ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తేనే భారత్‌‌తో దోస్తీ

ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తేనే భారత్‌‌తో దోస్తీ

ఇస్లామాబాద్: జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తేనే భారత్ తో దోస్తీ చేస్తామని పాకిస్థాన్ తెలిపింది. ఈ విషయాన్ని పరిష్కరించేంత వరకు భారత్ నుంచి వచ్చే పత్తి, చక్కెర దిగుమతులతోపాటు వాణిజ్యంపై నిషేధం కొనసాగుతుందని దాయాది పేర్కొంది. ఈ మేరకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని మంత్రి వర్గం నిర్ణయించిందని ఆ దేశ జాతీయ భద్రతా అధికారి మొయీద్ యూసఫ్ తెలిపారు. 'పలు చర్చల తర్వాత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ విషయం స్పష్టంగా చెప్పారు. జమ్మూ కశ్మీర్ (స్వయం ప్రతిపత్తి) విషయంలో భారత్ తన వైఖరిని మార్చుకునేంత వరకు ఆ దేశంతో వాణిజ్యం జరపబోమన్నారు. ఇది మా సూత్రప్రాయ నిర్ణయం' అని యూసఫ్ పేర్కొన్నారు.