2021లో చైనాలో కమ్యూనిస్ట్ ఏర్పడి 100సంవత్సరాలు కావస్తున్న టైంలో విస్తరణ వాదమే లక్ష్యంగా చైనా ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. లడఖ్ సరిహద్దు వివాదంలో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా అక్కడ భారీ ఎత్తున సైన్యాన్ని దింపుతున్నట్లు సమాచారం.
యుద్ధ సన్నివేశాల్ని తలిపించేలా ఇండో – చైనా సరిహద్దులో వేలాది మంది సైనికులు కవాతు చేస్తున్న దృశ్యాల్ని చైనా మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీ ఎల్ ఏ ) యొక్క వందలాది మంది సైనికులు, పీ ఎల్ ఏ వైమానిక దళం వైమానిక బ్రి గేడ్ సైనికులు కవాతు చేస్తున్నారు. ఈ సందర్భంగా చైనా – ఇండియా సరిహద్దు ఉద్రిక్తతల మధ్య సెంట్రల్ చైనా హుబీ ప్రావిన్స్ నుండి వాయువ్య ప్రాంతం నుంచి ఎత్తైన ప్రాంతానికి వెళ్లే మార్గాల్ని కనిపెట్టేందుకు గంటల సమయం పట్టినట్లు గ్లోబల్ టైమ్స్ తెలిపింది.
మరోవైపు జూన్ 6 శనివారం చైనా మొలోడోలో చైనా ప్రతినిధి బృందానికి ప్రాతినిధ్యం వహించిన సౌత్ జిన్జియాంగ్ మిలిటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ మేజర్ జనరల్ లిన్ లియు, ఇండియా తరుపున బృందానికి 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వంలో భేటీ జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సైనిక నిర్మాణానికి ముందే పాంగోంగ్ త్సోలో యథాతథ స్థితిని పునరుద్ధరించాలని ఇండియా కోరింది. మరోవైపు, చైనా ఈ ప్రాంతంలో రహదారి నిర్మాణ కార్యకలాపాలను ఆపాలని భారత్ డిమాండ్ చేసింది. సమావేశం తరువాత, భారత ప్రతినిధి బృందం తిరిగి లేహ్ కు చేరుకుంది . తరువాత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), జాతీయ భద్రతా సలహాదారు (NSA) ను సమావేశ నిమిషాల గురించి వివరించారు. మే 5 న పాంగోంగ్ త్సో సరస్సు వద్ద భారత మరియు చైనా దళాల మధ్య భౌతిక ఘర్షణ తరువాత ఇండో-చైనా సరిహద్దులోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఐసి) యొక్క రెండు వైపులా సైనిక నిర్మాణం తీవ్రమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా లడాఖ్ లో తన సైనికుల్ని మోహరించడం ఉద్రిక్తతకు దారితీస్తోంది.
Several thousand soldiers with a Chinese PLA Air Force airborne brigade took just a few hours to maneuver from Central China’s Hubei Province to northwestern, high-altitude region amid China-India border tensions. https://t.co/dRuaTAMIt0 pic.twitter.com/CtRJRk13IO
— Global Times (@globaltimesnews) June 7, 2020
