భారత నావికులతో వెళ్తున్న మరో నౌక లియాకి ఫ్రీడమ్ పై దాడి జరిగిందనే వార్తలపై విదేశాంగ శాఖ స్పందించింది. ఒమన్ తీరంలో శనివారం (జూన్ 13) ఉదయం ఇండియన్ క్రూ మెంబర్స్ తో వెళ్తున్న నౌకపై దాడి జరిగిందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. దాడి జరగటంతో కమ్యూనికేషన్ నుంచి దూరంగా వెళ్లిందని.. నౌక నుంచి ఎలాంటి స్పందన లేదనే వార్తలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టాయి. స్పదించిన భారత విదేశాంగ శాఖ ( MEA).. అది ఫాల్స్ న్యూస్ అని కొట్టి పారేసింది. నిరాధారమైన వార్తగా పేర్కొంది.
ఫేక్ న్యూస్ అలర్ట్.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు. భారత నావికులతో వెళ్తున్న షిప్ పై దాడి జరిగిందనేది అబద్ధపు ప్రచారం అని MEA ట్వీట్ చేసింది.
ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ప్రకారం, తమ వెరీ హై ఫ్రీక్వెన్సీ (VFH) రేడియో స్పందించకపోవడంతో ఆ నౌకను సంప్రదించలేకపోయినట్లు పేర్కొంది.. అయినప్పటికీ, ఆ నౌక స్థానాన్ని గుర్తించగలింది. అక్షాంశం 24°43.85N, రేఖాంశం 56°37.52E వద్ద ఉన్నట్లు ఎట్టకేలకు రేడియో గుర్తించదని పేర్కొంది.
ఇటీవల గల్ఫ్‌లో భారతీయ సిబ్బందితో ఉన్న మూడు నౌకలపై దాడులు జరిగిన తర్వాత మరో నౌకపై దాడులు అనే వార్త తీవ్ర ఆందోళన కలిగించింది. గతంలో జరిగిన ఈ దాడులను అమెరికా నావికా దళాలు జరిపినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ధృవీకరించగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ నిందను ఇరాన్‌పై మోపి, ఈ దాడుల వెనుక టెహ్రాన్ ఉందని ఆరోపించారు.
గల్ఫ్‌లో అమెరికా నౌకాదళం జరిపిన దాడుల్లో ఇప్పటివరకు ముగ్గురు భారతీయ నావికులు మరణించిన విషయం తెలిసిందే.
