
- ఉద్యోగులకు డ్యూటీ రోజు విడిచి రోజు!
- త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులకు రోజు విడిచి రోజు డ్యూటీస్ కు అవకాశం ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. ఇందుకోసం త్వరలో జీవో విడుదల చేసే చాన్స్ ఉంది. ఇప్పటికే పలు ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ప్రధానంగా సెక్రటేరియట్ లో పనిచేస్తోన్న 50 మంది ఎంప్లాయిస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కొన్ని జిల్లాల కలెక్టరేట్లలో పనిచేసే స్టాఫ్కు కూడా కరోనా సోకినట్టు ప్రభుత్వానికి రిపోర్టులు అందాయి. దీంతో రోజు విడిచి రోజు విధులకు హాజరయ్యే అవకాశం ఇవ్వాలని పలు ఎంప్లాయీస్ యూనియన్లు సీఎస్ సోమేశ్ కుమార్ ను కోరాయి. దీనిపై సీఎం కేసీఆర్ తో మాట్లాడి తుదినిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.