నటి హన్సిక ఇంట పెళ్లి సందడి

నటి హన్సిక ఇంట పెళ్లి సందడి

నటి హన్సిక ఇంట పెళ్లి పనులతో సందడి నెలకొంది. డిసెంబర్ 4న రాజస్థాన్‭ జైపూర్‭లోని ముండోటా ఫోర్ట్ ప్యాలెస్‭లో వ్యాపారవేత్త సోహైల్‭తో ఆమె వివాహం జరగనుంది. ఇటీవల మాతా కీ చౌకీతో వీరి వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్‭గా మారాయి. హన్సిక ఎరుపు రంగు చీరలో అందంగా ముస్తాబై అందరినీ ఆకట్టుకుంది.  

స్నేహితులందరికీ హన్సిక బ్యాచిలర్ పార్టీ కూడా ఇచ్చింది. గ్రీస్‌లో జరిగిన ఈ పార్టీలో తన స్నేహితులతో కలిసి ఆమె ఫుల్‌ ఎంజాయ్‌ చేసింది. కూల్‌ డ్రింక్‌ పట్టుకుని అక్కడి వీధుల్లో తిరుగుతూ హ్యాపీగా గడిపింది. అనంతరం ఫ్రెండ్స్‌తో కలిసి డ్యాన్స్‌ చేసింది. కొంతకాలంగా సోహైల్‭తో ప్రేమలో ఉన్న హన్సిక కుటుంబ సభ్యుల అంగీకారంతో అతడిని వివాహం చేసుకోనుంది. వీరీ పెళ్లి ఏర్పాట్లు భారీ స్థాయిలో జరుగుతున్నాయి.