ఆరు బాల్స్ లో ఆరు సిక్సర్లు కొట్టాలనుకున్నా

ఆరు బాల్స్ లో ఆరు సిక్సర్లు కొట్టాలనుకున్నా

ముంబై: రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ చివరి ఓవర్లో ఆరు బాల్స్ లో ఆరు సిక్సర్లు కొట్టగలనన్న నమ్మకంతో ఉన్నానని ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ రోమ్‌‌మన్‌‌ పావెల్ తెలిపాడు. కానీ మూడో బంతిని అంపైర్ నోబాల్ ప్రకటించకపోవడం నిరాశకు గురిచేసిందన్నాడు. ‘మేం ఎప్పుడూ భవిష్యత్ గురించే ఆలోచిస్తాం. ప్లేఆఫ్స్ కు క్వాలిఫై కావడానికి ముందు చాలా ముఖ్యమైన మ్యాచ్ లు ఉన్నాయి. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడానికి సమయం లేదు. నిజానికి ఆ ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టగలనని నమ్మకంతో ఉన్నా. రెండు సిక్సర్లు బాదాక మూడోది కూడా కొట్టా. అయితే ఆ బంతి నో బాల్ అని అనుకున్నా. కానీ అంపైర్ నిర్ణయమే ఫైనల్. మేము క్రికెటర్స్ కాబట్టి ఆ నిర్ణయాన్ని గౌరవించి ముందుకు సాగాల్సిందే. ముందు మ్యాచ్ ల్లోనూ ఇదే ఫామ్ కొనసాగించాలని చూస్తున్నా’ అని పావెల్ చెప్పుకొచ్చాడు.