బీసీ బిల్లు చారిత్రాత్మక నిర్ణయం : డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు

బీసీ బిల్లు చారిత్రాత్మక నిర్ణయం : డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు

నిర్మల్, వెలుగు: అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదం చారిత్రాత్మక విజయమని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.  స్థానిక కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ముందు కాంగ్రెస్ నాయకులు పటాకులు కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.  అనంతరం శ్రీహరి రావు మాట్లాడారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను శాసనసభ ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. 

 కామారెడ్డి డిక్లరేషన్‌‌ లో  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోందన్నారు.  బీసీలకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ ముందుకు వెళ్తుంటే బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. గ్రంథాలయ సంస్థ  చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీం రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజే శ్వర్ తదితరులు పాల్గొన్నారు.