చెన్నైలోని డీ-అడిక్షన్ సెంటర్ లో దారుణం

చెన్నైలోని డీ-అడిక్షన్ సెంటర్ లో దారుణం

చెన్నై: తమిళనాడులోని తిరుచ్చిలో దారుణం జరిగింది. స్థానిక కే.కే నగర్ లోని ఓ డీ-అడిక్షన్ సెంటర్ లో మత్తు పదార్ధాలకు బానిసైన వారిని చికిత్స పేరుతో చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఆ కేంద్రంలో చేరిన సెల్వన్ అనే వ్యక్తి మృతితో ఈ విషయం బయటపడింది.

మత్తు పానీయాలకు అలవాటైన 24 మంది తమ ఆరోగ్యాన్ని బాగు చేసుకునేందుకు అక్కడి  డీ-ఆడిక్షన్ కేంద్రంలో  చేరారు. అక్కడి నిర్వాహకులు వారిని చికిత్స పేరుతో కాళ్లను గొలుసులతో బంధించి  చిత్రహింసలకు గురి చేస్తున్నారు. సమయానికి ఆహారం అందించకుండా ఇబ్బందులు పెడుతున్నారు.

ఆ కేంద్రంలో చికిత్స పొందుతున్న కడలూరు జిల్లాకు చెందిన తమిల్ సెల్వన్ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం అనుమానాస్పదంగా  మృతి చెందాడు. అతని అంత్యక్రియల సమయంలో కుటుంబ సభ్యులు ఒంటిపై ఉన్న గాయాలను గుర్తించి.. అనుమానంతో  పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ డి-అడిక్షన్ సెంటర్ పై దాడులు నిర్వహించారు.  అక్కడ చికిత్స పొందుతున్న మిగతా వారిని, వారి బారి విడిపించారు. దీనంతటికి కారణమైన కేంద్రం నిర్వహకులపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.