మూడు నెలలుగా సౌదీలో డెడ్​బాడీ.. తెప్పించాలంటూ కుటుంబసభ్యుల వినతి

మూడు నెలలుగా సౌదీలో డెడ్​బాడీ.. తెప్పించాలంటూ కుటుంబసభ్యుల వినతి

శవం తెప్పించాలంటూ కుటుంబీకుల వినతి

సికింద్రాబాద్, వెలుగు: గల్ఫ్​లో చనిపోయిన కార్మికుడి మృతదేహం కోసం 3 నెలలుగా కుటుంబీకులు ఎదురు చూస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామానికి చెందిన వొంటరి నర్సారెడ్డి(48) 2013లో సౌదీ వెళ్లాడు. డ్యూటీలో ఉండగా 2020  నవంబర్ 1న ప్రమాదవశాత్తు మృతి చెందాడు. 94 రోజులుగా మృతదేహం సౌదీలోని ఆసుపత్రి మార్చురీలో ఉందని, వెంటనే ఇండియాకు పంపడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ నాయకులు స్వదేశ్ పరికిపండ్ల, దీకొండ కిరణ్ తో కలిసి మృతుడి భార్య లక్ష్మి, కొడుకు సంతోష్, ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని భారత విదేశాంగ శాఖ అధికారి, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమ్మిగ్రెంట్స్​ ముఖేష్ కౌశిక్, పాస్ పోర్టు అధికారికి  బుధవారం వినతిపత్రం అందించారు.

For More News..

రేషన్‌కు మొబైల్ నెంబర్ లింక్.. మీ సేవా సేంటర్ల వద్ద బారులు