
హైదరాబాద్, వెలుగు: బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2025– 26 అకడమిక్ ఇయర్ లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్టు సెక్రటరీ సైదులు వెల్లడించారు. స్టూడెంట్స్, పేరెంట్స్ నుంచి వినతులు రావడంతో గడువును పొడిగించామని ఆదివారం పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
డిగ్రీ కాలేజీల్లో బీఎస్సీ, బీకాం, బీఏ, బీబీఏ, బీఎఫ్ టీ, యానిమేషన్ కోర్సులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆన్ లైన్ లో mjptbcwreis.telangana.gov.in , tgrdccet.cgg.gov.in/TGRDCWEB/ వెబ్ సైట్ లలో దరఖాస్తు చేసుకోవాలని సెక్రటరీ సూచించారు. బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని, కాలేజీ ప్రిన్సిపాల్ కు అప్లికేషన్ సమర్పిస్తే సరిపోతుందన్నారు.