పాక్ లో భారీ పేలుడు..39 మంది మృతి

పాక్ లో భారీ పేలుడు..39 మంది మృతి

పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం జరిగింది . ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఓ  పొలిటికల్ పార్టీ మీటింగ్ లో  భారీ పేలుడు జరిగింది. ఈ  పేలుడులో 39 మంది మరణించగా.. 60 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి  చేరుకున్న  ఐదు అంబులెన్సుల్లో  గాయపడిన వారిని  స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నాయి. రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. 

 ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనుండగా ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని ఖార్ పట్టణంలో సమావేశాన్ని నిర్వహిస్తున్న జమియాత్ ఉలేమా-ఎ-ఇస్లాం (ఎఫ్) పార్టీ లక్ష్యంగా పేలుడు జరిగిందని  ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అక్తర్ హయత్  తెలిపారు. పార్టీ నుండి ఒక సీనియర్ నాయకుడు వేడుకలో ప్రసంగించాల్సి ఉండగా..  అతను రాకముందే బాంబు పేలుడు జరిగిందని చెప్పారు.  దాడికి పాల్పడిందెవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఈ ఘటనపై పాక్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది.